AKP: అచ్యుతాపురం మండలం హరిపాలెం–అందాలపల్లి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు శ్రీ భగీరథి అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రంగురంగుల పుష్పమాలలు, నిమ్మకాయలు, స్వర్ణాభరణాలతో అమ్మవారిని విశేషంగా అలంకరించారు. దుష్టశక్తులపై దైవశక్తి విజయానికి ప్రతీకగా నిలిచే అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిషాసుర మర్దిని అలంకరణలో భగీరథి అమ్మవారు


