భోజన సమయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తింటున్నప్పుడు ఫోన్ చూడటం, టీవీ చూడటం మానేయాలి. దీనివల్ల మనం ఎంత తింటున్నామో తెలియక అతిగా తినేస్తాం. ఆహారాన్ని సరిగ్గా నమలకుండా త్వరత్వరగా మింగడం జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. భోజనానికి ముందు లేదా తింటున్నప్పుడు ఎక్కువ నీళ్లు తాగకూడదు. ప్రశాంతంగా, శ్రద్ధగా తింటే ఆరోగ్యానికి మంచిది.
ఆరోగ్యం
భోజన సమయంలో ఈ తప్పులు చేయకండి


