హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనిగిరిలో వైసీపీ నాయకుల నిరసన

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం వైసీపీ ఇంఛార్జ్ నారాయణ నిరసనకు దిగారు. నామినేషన్ల పరిశీలనకు వచ్చిన అభ్యర్థులను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారని వారు ఆరోపించారు. కార్యాలయంలోకి చొరబడి అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.