ASR: TDP తరఫున 10వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా గరే జ్యోతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్, MLA గంటా శ్రీనివాసరావులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వార్డులో మౌలిక వసతుల కల్పనకు, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొంటూ, తనను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా జ్యోతి నామినేషన్ దాఖలు


