హైదరాబాద్: 28°C
క్రీడలు

పారా ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం

ఐచీ నగోయా వేదికగా జరుగుతున్న పారా ఆసియా క్రీడల తొలి రోజు భారత్ అద్భుత విజయాలతో ఖాతా తెరిచింది. షూటింగ్ విభాగంలో మోనా అగర్వాల్ స్వర్ణ పతకం సాధించగా, మరో షూటర్ అవని లేఖర రజత పతకం కైవసం చేసుకుంది. క్వాలిఫికేషన్‌లో 629.1 స్కోరుతో ఆసియా రికార్డు సృష్టించిన మోనా, ఫైనల్‌లో 250 పాయింట్లతో పసిడిని గెలుచుకుంది. అవని 249.6 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతం సాధించింది.