హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తపల్లి జలపాతానికి పోటెత్తిన పర్యాటకులు

ASR: దసరా సెలవులు, వారాంతం కావడంతో జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతానికి పర్యాటకులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులతో ఈ ప్రాంతం కిక్కిరిసింది. జలపాత సుందర దృశ్యాలను తిలకిస్తూ పర్యాటకులు ఆనందోత్సాహాలతో గడిపారు.