విశాఖ నగరవాసుల ఇలవేల్పు అయిన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు దేవీ నవరాత్రులలో భాగంగా ఇవాళ శాఖాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చైర్మన్ కందుల నాగరాజు, ఆలయ సిబ్బంది దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
శాఖాంబరి అలంకరణలో శ్రీ కనకమహాలక్ష్మి దర్శనం


