హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యాటక కేంద్రంగా మారుతున్న డల్లాపల్లి

ASR: పాడేరు మండలంలోని డల్లాపల్లి పర్యాటకులను ఆకర్షిస్తోంది. సముద్రమట్టానికి 3,300 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో తాజాగా ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ఎకోటూరిజం ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. గతంలో రవాణా సౌకర్యం లేక 20 కిలోమీటర్లు కాలినడకనే ప్రయాణించేవారరు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.2.5 కోట్లతో రహదారి నిర్మించడంతోపాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు.