హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కామేపల్లిలో రేపు దుర్గా హోమం

ప్రకాశం: జరుగుమల్లి మండలం కామేపల్లిలోని పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో విజయదశమి సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు దుర్గా హోమం నిర్వహించనున్నారు. అర్చక స్వామి, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ దుర్గా మూల మంత్రంతో హోమ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా అమ్మవారి భక్తులందరూ హోమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని దేవస్థాన ఛైర్మన్ పెదబాబు కోరారు.