హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్సు సీటు గొడవ.. కర్రలు, రాడ్లతో దాడి

KKD: ఆర్టీసీ బస్సు సీటు గొడవ దాడికి దారితీసింది. తునిలో రాజమహేంద్రవరం గారా అప్పారావు కుటుంబానికి, ఏలేశ్వరం సిరిపురం మహిళలకు సీట్లపై వివాదం రేగింది. మహిళల పిలుపుతో చిన్నింపేట వద్ద కొందరు బస్సులో చొరబడి అప్పారావు కుటుంబంపై కర్రలు, రాడ్లతో దాడి చేయడంతో నలుగురు గాయపడ్డారు. భయంతో ఇద్దరు యువతులకు ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలించారు.