TPT: రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఎల్ఎం ఆసుపత్రి సర్కిల్ వద్ద సోమవారం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఒడిశా నుంచి సేలం వైపు పత్తి రవాణా చేస్తూ వెళ్తున్న లారీ అదుపుతప్పి అక్కడే ఉన్న టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కేఎల్ఎం ఆసుపత్రి సర్కిల్ వద్ద లారీ బోల్తా


