హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారి పూలదండకు రూ.1.53లక్షలు

కోనసీమ: అమలాపురంలో మహిషాసురమర్దిని అమ్మవారి మెడలో వేసే తొలి పూలదండకు వేలంపాట నిర్వహించారు. హైదరాబాద్‌లో స్థిరపడిన వ్యాపారవేత్త ఆకుల లక్ష్మణరావు రూ.1.53 లక్షలకు దక్కించుకున్నారు. 14 ఏళ్ల క్రితం రూ.3,500తో మొదలైన వేలంపాట నేడు రూ.1.53 లక్షలకు చేరింది. వరుసగా మూడోసారి ఈ అవకాశం దక్కించుకున్న లక్ష్మణరావు, విజయదశమి రోజున అమ్మవారి మెడలో ఈ పూలదండ వేయనున్నారు.