హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ అమరవీరుల దినోత్సవ సన్నద్ధత

BPT: పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని ఈ నెల 21న ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం సిబ్బంది కవాతు ప్రాక్టీస్ చేశారు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరులకు నివాళులు అర్పించేందుకు పరేడ్, గౌరవ వందనం అంశాల్లో సాధన చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.