హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్తెనపల్లిలో బస్సు ఢీకొని వృద్ధుడు మృతి

PLD: సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొని కంకణాలపల్లికి చెందిన తాడికొండ బిక్షం(70) అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం తర్వాత మృతదేహాన్ని ముట్టుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ కోటేశ్వరరావు స్వయంగా ముందుకొచ్చి తరలించారు. ఆయన ఔదార్యాన్ని ప్రయాణికులు ప్రశంసించారు.