హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విఘ్నేశ్వర స్వామికి వెండి పళ్లెం బహుకరణ

కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి భీమవరం వాస్తవ్యులు పున్నం వెంకట శ్రీనివాస్ రూ.1.30 లక్షల విలువైన 580 గ్రాముల వెండి ఏనుగు పాదాలు కలిగిన పళ్లెంను సోమవారం విరాళంగా అందజేశారు. అనంతరం ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, శేషవస్త్రాలతో సత్కరించారు.