SKLM: దసరా పండగ నేపథ్యంలో నాటు కోళ్లకు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది.శ్రీకాకుళం, ఆమదాలవలస సంతల్లో నాటు కోళ్ల కొనుగోళ్లు పెరగడంతో ధరలు గణనీయంగా పెరిగాయి. నాటు కోళ్లు కిలో రూ.900 - రూ.1,000 వరకు పలుకుతున్నాయి. పెంపకం నాటు కోళ్లు సైతం కిలో రూ.400- రూ.500 వరకు విక్రయిస్తున్నారు. పండగ వేళ డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరిగాయని వ్యాపారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దసరా వేళ నాటు కోళ్లకు భారీ డిమాండ్


