హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

మార్కాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడరాదని, అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు.