హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాత పెందుర్తిలో మందుగుండు సామగ్రి స్వాధీనం

విశాఖపట్నం పాత పెందుర్తి ప్రాంతంలో గత రాత్రి టాస్క్ ఫోర్స్, పెందుర్తి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఒక కంపెనీకి చెందిన ఈ సామగ్రిని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి సరఫరా చేయడానికి అద్దె గదుల్లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.