హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన డిమాండ్‌తో టీడీపీలో టెన్షన్!

VZM: బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. వైసీపీ 36 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేయగా.. కూటమిలో పంపకాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. టీడీపీ 31, జనసేన 4, బీజేపీకి ఒక స్థానం ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. 11 సీట్లు కావాలని జనసేన పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో జనసేన తరఫున 11 వార్డుల్లో 15 మంది నామినేషన్లు పడ్డాయి.