హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు విద్యార్థిని ఎంపిక

ATP: ఈ నెల 30 నుంచి ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు సిద్ధరాంపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న నందిని ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు నాగరాజు తెలిపారు. ఇటీవల కర్నూలులో జరిగిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో ఆమె అత్యుత్తమ ప్రతిభ కనపరచడంతో జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. దీంతో ప్రధానోపాధ్యాయిని నీరజ నందినిని అభినందించారు.