PLD: క్రోసూరు, అచ్చంపేట మండలాల నాయకులతో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఈరోజు ఉదయం సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి, ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. కూటమి నేతల సమన్వయంతో ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా సాగాలని దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: ఎమ్మెల్యే ప్రవీణ్


