హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరంలో బీజేపీ టికెట్ల లొల్లి!

VZM: విజయనగరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ టికెట్ల వ్యవహారం గందరగోళంగా మారింది. నాలుగు డివిజన్లే కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. 12 మంది నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. సీట్ల పంపకాలపై స్పష్టత రాకపోవడంతో బీ-ఫారాలు లేకుండానే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీంతో ఎవరికి పార్టీ అధికారిక గుర్తింపు దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.