హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకల్లో విషాదం..మహిళ మృతి

KMM: నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. అప్పల నరసింహపురానికి చెందిన యలగాల భారతి (50) ఆదివారం రాత్రి బంధువుల ఇంటికి రాగా, వేడుకల్లో భాగంగా డీజే వద్ద నృత్యం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.