హైదరాబాద్: 28°C
వార్తలు

‘భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదగాల్సిందే’

భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా ఎదగాలని ప్రముఖ ఆర్థికవేత్త నౌరియల్ రౌబిన్ అభిప్రాయపడ్డారు. యువ జనాభాకు తగిన ఉద్యోగాలు కల్పించడానికి దేశం వార్షికంగా కనీసం 9% వృద్ధి రేటును సాధించాలని ఆయన సూచించారు. ప్రస్తుత 7% వృద్ధి ప్రపంచానికి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఏఐ రాకతో ఉపాధి రంగాలు మారుతున్న నేపథ్యంలో జీడీపీ వృద్ధి ఒక్కటే సరిపోదని ఆయన స్పష్టం చేశారు.