హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరం పై దాడి ఆరుగురి అరెస్ట్

NZB: నవీపేట మండలం శాఖాపూర్ శివారులో జూద స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై శ్రీకాంత్  తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. అందిన సమాచారం మేరకు జూదం ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.4,800 నగదు, ఆరు చర వాణులు, ఆరు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.