మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. గ్రామ సర్పంచ్ మస్కూరి బాలరాజు ఆధ్వర్యంలో పండుగ సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆడపడుచులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ.. ఉత్సాహంగా ఆడారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
తెలంగాణ
VIDEO: దంతేపల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు


