హైదరాబాద్: 28°C
క్రీడలు

క్లీన్‌ స్వీప్‌పై టీమిండియా ఫోకస్

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్​లో టీమిండియా​ మహిళల జట్టు ఘనవిజయం సాధించింది. 103 పరుగుల లక్ష్యాన్ని 8.5 ఓవర్లలోనే ఛేదించింది. షెఫాలీ వర్మ 25 బంతుల్లో 55 రన్స్ చేసి సత్తా చాటింది. స్మృతి మంధాన 25 బంతుల్లో 47 రన్స్‌, చివర్లో అనుష్క శర్మ 1 రన్‌ చేసింది. రేపు జరిగే ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలతో ఉన్నారు.