హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బయటపడ్డ పురాతన తుపాకీ గుండ్లు

ప్రకాశం: కంభంలోని ఎర్రబాలెం గ్రామంలో గల రామాలయం వద్ద ఆదివారం పురాతన కట్టడంలో కార్మికులకు తుపాకీ గుండ్లు లభించాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కార్మికుల నుంచి 56 గుండ్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలన కోసం ఆర్కియాలజీ శాఖకు అప్పగించారు. ఇవి బ్రిటిష్ కాలం నాటి తుపాకీ గుండ్లు అయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.