హైదరాబాద్: 28°C
తెలంగాణ

పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ పై ప్రకటన

NLG: దేవరకొండ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని ఐదు పత్తి మిల్లుల్లో ఈనెల 22 నుంచి సీసీఐ ద్వారా స్లాట్ బుకింగ్ ప్రారంభమవుతుందని మార్కెట్ కార్యదర్శి రవీందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పత్తిని సీసీఐలో విక్రయించేందుకు రైతులు ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ అవకాశాన్ని మార్కెట్ పరిధిలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.