హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నెహ్రూ జూపార్క్‌కు ఒక్కరోజే 20వేల మంది!

HYD: నెహ్రూ జూపార్క్‌కు సందర్శకులు భారీగా తరలివచ్చారు. నిన్న సెలవు రోజు కావడంతో జూపార్క్‌లో సందడి నెలకొంది. జంతువులను చూసేందుకు చిన్నారులు, పెద్దలు కుటుంబ సమేతంగా క్యూ లైన్లలో బారులు తీరారు. జూపార్క్‌లోని వివిధ జంతువులు, పక్షులను వీక్షిస్తూ సందర్శకులు ఉత్సాహంగా గడిపారు. మొత్తం 20,483 మంది నెహ్రూ జూపార్క్‌ను సందర్శించినట్లు సమాచారం.