హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అక్రమంగా నీటిని మళ్లిస్తే చర్యలు తీసుకోవాలి: MLA

SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు పంట కాలువలో ​ఎవరైనా అక్రమంగా మోటార్లు పెట్టి నీటిని మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం నల్లవాగు లో అధికారులతో సమీక్షించారు. ఎగువ ప్రాంత రైతులు అవసరమైనంత వరకే నీటిని వాడుకుని, దిగువ ప్రాంత రైతుల ప్రయోజనాలను కాపాడాలన్నారు.