ASF: చింతలమానెపల్లి మండలంలోని రవీంద్ర నగర్ సబ్ స్టేషన్ పరిధిలోని బాలాజీ అనుకోడ, బాబాసాగర్, రుద్రపూర్ తదితర గ్రామాల్లో విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్తు సిబ్బంది అప్రకటిత కరెంట్ కోతలు విధిస్తుండటంతో కార్యాలయాల్లో ముఖ్యమైన పనులు నిలిచిపోతున్నాయి. ఆన్లైన్ సెంటర్, మీసేవా కేంద్రాలలో స్లాట్ బుకింగ్ ఇతర పనులకు ఆటంకం కలుగుతోంది.
తెలంగాణ
అప్రకటిత కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బందులు..!


