హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెట్టికోట శివాలయంలో సోమవారం పూజలు

NDL: కొలిమిగుండ్ల మండలం పెట్టికోట శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి శివాలయంలో ఉన్న శివలింగానికి అభిషేకాలు, కుంకుమార్చన ఇంకా అనేక పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు.