ప్రకాశం: గిద్దలూరులో దసరా పండుగ సందర్భంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి వేషధారణలతో ఊరేగింపును ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. అమ్మవారి వేషాల్లో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలను తిలకించేందుకు వందలాది మంది ప్రజలు, భక్తులు తరలివచ్చారు. భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపు ఉత్సాహభరితంగా సాగింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గిద్దలూరులో ఘనంగా దసరా వేడుకలు


