హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ సంబురాల్లో మయన్మార్ యువతి సందడి

MLG: ములుగు మండలం ఇంచర్లలో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మయన్మార్‌కు చెందిన శంషు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంచర్లకు చెందిన స్రవంతి పదేళ్ల తర్వాత సింగపూర్ నుంచి పుట్టింటికి బతుకమ్మ పండుగకు రాగా, తన స్నేహితురాలు శంషును వెంట తీసుకొచ్చారు. తెలంగాణ ఆడపడుచుల ఆటపాటలు, బతుకమ్మ సంబురాలు, సంప్రదాయాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని శంషు తెలిపారు.