హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మైదుకూరులో వైసీపీ నామినేషన్లు నిల్‌!

KDP: మైదుకూరు మున్సిపాలిటీలోని 32 వార్డులకు గాను వైసీపీ కేవలం 7 వార్డుల్లోనే నామినేషన్లు దాఖలు చేసింది. మిగిలిన 25 వార్డుల్లో నామినేషన్లు వేయలేదు. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆ వార్డుల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. మున్సిపల్ ఛైర్మన్ పదవికి కూడా వైసీపీ నామినేషన్ వేయలేదు.