హైదరాబాద్: 28°C
తెలంగాణ

బూత్ లెవల్ ఏజెంట్లతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ..!

KMM: ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర కీలకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం వైరా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఓటరు వివరాలను నమోదు చేసేలా ఏజెంట్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అనంతరం ఏజెంట్ల కుటుంబాలను కలసి, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.