హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం మార్కెట్లో కూరగాయల ధరలు..!

KMM: ఖమ్మం నగరంలోని ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్‌లో సోమవారం కూరగాయల ధరల వివరాలను అధికారులు వెల్లడించారు. మార్కెట్లో కిలో టమాటా రూ.30, వంకాయ రూ.30, పచ్చిమిర్చి రూ.60, బెండకాయ రూ.20, ఉల్లిగడ్డలు రూ.70 చొప్పున విక్రయించారు. అత్యధికంగా బోడకాకర రూ.140, బీన్స్ రూ.80 పలుకగా, డజన్ కోడిగుడ్ల ధర రూ.80 గా ఉందని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.