హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్ద సేవలపై విహరించిన హరిహరులు

SRCL: దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వర ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి హరిహరులు పెద్ద సేవపై ఆలయ అంతరాయంలో విహరించారు. రంగురంగుల పూలతో స్వామివార్లను శోభాయమానంగా అలంకరించారు. హరిహరుల దివ్య దర్శనం కోసం భక్తులు, పుర ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హరిహరుల పెద్ద సేవను తిలకించి భక్తులు పులకించారు.