NGKL: ఊర్కొండ(M) రేవల్లిలో MLA జనంపల్లి అనిరుధ్ రెడ్డి తన సొంత నిధులతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను, అలాగే నూతన మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించారు. మహిళా సంఘాల సాధికారతతో పాటు, ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొంటూ.. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
సొంత నిధులతో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన: MLA


