హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు

MHBD: గూడూరు మండలంలో ఆదివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు భూక్య ఉమా మురళి నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని, మహిళల ఆత్మగౌరవం, ఐక్యతకు నిదర్శనమని పేర్కొంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.