హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనకాపల్లి జిల్లాకు పిడుగుల హెచ్చరిక

అనకాపల్లి జిల్లాలో ఈ రాత్రి, రేపు ఉరుములు, పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని తెలిపింది. వర్షం పడేటప్పుడు ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండరాదని అధికారులు సూచించారు.