హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారిని దర్శించుకున్న పోలీస్ కమిషనర్

విశాఖలోని ఎన్ఏడీ కొత్త రోడ్డు జంక్షన్ సమీపంలోని ఉమియా భవన్‌లో దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గుజరాతీయులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.