హైదరాబాద్: 28°C
వార్తలు

మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం

HYD: మాదాపూర్‌లోని యూనిస్ట్రింగ్ టెక్ సొల్యూషన్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యాంటీ డ్రోన్ సిస్టమ్స్ తయారీకి సంబంధించిన గోదాములో మంటలు చెలరేగాయి. దీంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.