హైదరాబాద్: 28°C
వార్తలు

మేడ్చల్ చర్చిలో యువజన ఆరాధన

MDCL: మేడ్చల్‌లోని సిఎస్ఐ వెస్లీ చర్చిలో యువజన ఆదివారపు ఆరాధన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రెవరెండ్ జోసెఫ్ కిషోర్ మార్గదర్శకత్వంలో యువతీ యువకులు స్కిట్లు, భక్తిగీతాలు, దైవవాక్య పఠనంలో పాల్గొన్నారు. రెవరెండ్ సైరస్ దైవ సందేశాన్ని అందిస్తూ, జీవితంలోని సవాళ్లను విశ్వాసంతో ఎదుర్కొంటూ క్రైస్తవ విలువలను ఆచరించాలని సూచించారు.