హైదరాబాద్: 28°C
వార్తలు

గూడూరులో ఘనంగా బతుకమ్మ వేడుకలు

MHBD: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం గూడూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ మహిళలు సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.