హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలువ గట్టు కోతతో ప్రమాదకరంగా మారిన రహదారి

KRNL: పెద్దకడబూరు మండలం మేకడోన గ్రామ శివారులో ఉన్న LLC కాలువ గట్టు కోతకు గురై ప్రమాదకరంగా మారుతోంది. కాలువను ఆనుకుని పెద్దతుంబళం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గట్టు మరింత కోతకు గురైతే రహదారికి ప్రమాదం పొంచి ఉందని వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలన్నారు.