హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సీపీకి కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

NZB: నగరంలో రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) పనుల నేపథ్యంలో అమలు చేస్తున్న వన్‌వే ట్రాఫిక్‌ను దసరా సందర్భంగా వాయిదా వేయాలని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా కోరారు. దీనిపై వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించిన సీపీ సాయి చైతన్యకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పండుగ సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.