హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా తాతాజీ

AKP: రాంబిల్లి మండలం పెద్ద కలవలాపల్లి ఎంపీటీసీ సెగ్మెంట్‌ కూటమి అభ్యర్థిగా కలవాలపల్లి తాతాజీని ఎంపిక చేసినట్లు మండల ఐటీడీపీ అధ్యక్షుడు చెల్లూరి కోదండరావు తెలిపారు. కూటమి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని, అన్ని ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.