WNP: పట్టణంలోని వెంగళరావు కాలనీకి చెందిన గీతాదుర్గ అండర్-19 విభాగంలో జాతీయస్థాయి చెస్ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 23 నుంచి 28 వరకు ఢిల్లీలో జరిగే పోటీల్లో ఆమె పాల్గొననుంది. క్రీడాకారిణి గీతాదుర్గకు ఎమ్మెల్యే మేఘారెడ్డి అండగా నిలిచి, ప్రయాణ ఖర్చులతో పాటు వసతి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జాతీయస్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
జాతీయ చెస్ పోటీలకు వనపర్తి అమ్మాయి


